హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాశిబుగ్గ శివాలయంలో శ్రావణమాస ఉత్సవాలు

WGL: గ్రేటర్‌ వరంగల్‌ 20వ డివిజన్‌ పరిధిలోని కాశిబుగ్గ శివాలయంలో శ్రావణమాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం సప్తమి తిథిని పురస్కరించుకుని అర్చకులు తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పుష్పార్చన, మహాహారతి చేపట్టారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.