హైదరాబాద్: 28°C
తెలంగాణ

బిచ్కుందలో ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ

KMR: బిచ్కుంద మండలం శెట్లూర్ గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు భూమిపూజ నిర్వహించారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ కాళోజి విఠల్ రావు స్వయంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాన్ని లబ్ధిదారునికి అందజేశారు.