హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి నియామకం..!

MDK: చిన్నశంకరంపేట, బీజేపీ ఎస్సీ మోర్చా మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చిన్నశంకరంపేటకు చెందిన కర్రోళ్ల స్వామి బాధ్యతలు స్వీకరించారు. ఎంపీ రఘునందన్‌రావు ఆయనకు నియామక పత్రం అందించారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని స్వామి చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.