హైదరాబాద్: 28°C
తెలంగాణ

పల్లె దవాఖాన ప్రారంభించిన మంత్రి పొన్నం

KNR: సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పల్లె దవాఖానను మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పల్లె దవాఖానలు కీలకమని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.