హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్త్రీ శిశు సంక్షేమ కార్యాలయానికి భద్రత కరువు

RR: షాద్‌నగర్‌లోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో భద్రత, పరిశుభ్రత లోపాలపై మహిళా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ మందుబాబులు మద్యం సేవించి ఖాళీ సీసాలు, చెత్త పడేస్తున్నారని తెలిపారు. ఇటీవల కార్యాలయంలోకి పాము రావడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. 17 మంది మహిళా సిబ్బంది పనిచేస్తున్నందున అధికారులు భద్రత కల్పించాలని కోరుతున్నారు.