హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆ గ్రామంలో బెల్ట్ షాపులు బంద్.!

NLG: కనగల్ గ్రామపంచాయతీలో వచ్చేనెల సెప్టెంబర్ 1 నుంచి బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తూ తీర్మానం చేసినట్లు సర్పంచ్ ఇవాళ తెలియజేశారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి బెల్ట్ షాపులు నిర్వహిస్తే రూ. 50 వేల జరిమానాతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.