హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై నిలిచిన వర్షపు నీటితో ఇబ్బందులు

PDPL: ధర్మారం పట్టణంలో పెద్దపల్లి- ధర్మారం మార్గంలో అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే దారిలో ప్రధాన రోడ్డుపై వర్షపు నీరు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరుతో పాటు మట్టి రోడ్డుపైకి చేయడంతో వాహనదారులు జారిపడే ప్రమాదం ఉంది. గతంలో ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరిగాయని తెలిపారు. అధికారులు స్పందించి నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.