NLG: నార్కట్‌పల్లి మండలంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా ముసాయిదాను తహసీల్దార్ వేణుగోపాల్ ఇవాళ విడుదల చేశారు. గత ఇంటింటి సర్వే సమయంలో 44,091 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 40,246కు తగ్గిందని ఆయన తెలిపారు. మరణాలు, వలసలు, డబుల్ నమోదుల కారణంగా మొత్తం 3,845 ఓట్లను తొలగించినట్లు ఈ సందర్భంగా తహసీల్దార్ తెలియజేశారు.
తెలంగాణ
నార్కట్‌పల్లిలో 3,845 ఓట్లు తొలగింపు: తహసీల్దార్


