హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప్పల్‌లో రెండు ఫ్లైఓవర్లకు ప్రతిపాదన

MDCL: ఉప్పల్ నియోజకవర్గంలోని కుషాయిగూడ, రాధికా ఎక్స్ రోడ్స్ వద్ద పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈసీఐఎల్, కీసర, నాగారం ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని అన్నారు.