PDPL: ధర్మారం మండల కేంద్రంలోని హరిహరసుత శ్రీ అయ్యప్ప స్వామి గోశాల & దేవాలయంలో బుధవారం గోపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు గోమాతను అలంకరించి, చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆలయ పురోహితుడు నర్సింగరావు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రతి హిందువు గోపూజలో పాల్గొనాలని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు తాటిపల్లి ఈశ్వర్ తెలిపారు.
తెలంగాణ
'హరిహర సుతుడి ఆలయంలో గోపూజ'


