హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జిల్లాలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

KMR: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిజాంసాగర్ మండల కేంద్రంలో బుధవారం ఫోటోగ్రాఫర్స్ అధ్యక్షుడు పోచ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫోటోగ్రఫీకి ఆద్యుడు 'లూయిస్ డాగురె' చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చరిత్రలోని ప్రతి ఘట్టాన్ని, ప్రతి జ్ఞాపకాన్ని భావితరాలకు అందించడంలో ఫోటోగ్రఫీ కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.