హైదరాబాద్: 28°C
తెలంగాణ

16 ఏళ్ల నాటి హత్య.. జిల్లా వాసికి జీవిత ఖైదు

KMR: కేపీహెచ్‌బీ పరిధిలో 2010లో జరిగిన మోహన్‌నాయుడు హత్య కేసులో కామారెడ్డి జిల్లా వాసికి వెంకటాచారికి కూకట్ పల్లి కోర్టు జీవితఖైదు విధించింది. రూ. 20 వేల వివాదంతో మోహన్‌నాయుడిని కాల్చి చంపినట్లు విచారణలో తేలింది. హత్య అనంతరం బంగారు ఆభరణాలు దోచుకుని, మృతదేహాన్ని మెదక్ జిల్లా వల్లూరు అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.