హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారి మూసివేత.. సఫిల్‌గూడ వాసుల అవస్థలు

MDCL: ఈస్ట్‌ మారేడ్‌పల్లి నుంచి లక్ష్మీనగర్‌ మీదుగా ఏఓసీ చౌరస్తా, సఫిల్‌గూడ వెళ్లే రహదారిని మూసివేయడంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడంతో సమయం వృథా అవుతోందని వాపోతున్నారు. ఈ మార్గంలో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.