MBNR: రైల్వే ట్రాక్ సమీపంలోని పాడుబడిన బావిలో ఇంద్రానగర్ కాలనీకి చెందిన రమేష్ మృతదేహం లభ్యమైంది. మూడు రోజుల క్రితం చేపలు పట్టేందుకు వెళ్లిన రమేష్ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయినట్లు సమాచారం. బుధవారం ఉదయం మృతదేహం నీటిపైకి తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
పాడుబడిన బావిలో యువకుడి మృతదేహం


