హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.529 TMCల నీరు

SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్‌లో బుధవారం ఉదయం 6 గంటల సమయానికి 1.529 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు. రిజర్వాయర్ నీటిమట్టం 389.03 మీటర్లుగా నమోదైంది. 3.50 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 1.529 టీఎంసీలు ఉన్నాయి. 33 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా, అవుట్‌ఫ్లో లేదు. పంప్‌హౌస్‌లో ఎలాంటి పంపులు పనిచేయడం లేదని తెలిపారు.