హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్‌లో అదుపులోకి ముగ్గురు విద్యార్థులు

HYD: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో ముగ్గురు విద్యార్థుల ప్రమేయంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య అనంతరం నిందితులు హైదరాబాద్‌ వైపు వెళ్లినట్లు సమాచారం. ఇబ్రహీంపట్నం వద్ద ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు అదే పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థులుగా గుర్తించారు.