హైదరాబాద్: 28°C
తెలంగాణ

PACSలో రూ. 28 లక్షల మేర నిధులు గోల్ మాల్..!

NZB: ఎడపల్లి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌)లో భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఇటీవల నిర్వహించిన ఆడిట్‌లో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. సుమారు రూ. 28 లక్షల మేర నిధులు పక్కదారి పట్టినట్లు ఆడిట్‌ పరిశీలనలో గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం సహకార శాఖలో చర్చనీయాంశంగా మారింది.