హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'చెట్ల నరికివేతను అడ్డుకోవాలి'

కృష్ణా: గుడివాడ మండలం లింగవరం గ్రామంలో చెట్ల నరికివేతపై అధికారులు తక్షణమే దృష్టి సారించి, చెట్ల సంరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని ఇవాళ సామాజిక కార్యకర్త రవి కిరణ్ అన్నారు. గ్రామ సచివాలయం సమీపంలోని రైతు సేవా కేంద్రం వద్ద, తుమ్మలపల్లి ఎస్టేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని సుమారు 15 నుంచి 20 పచ్చని చెట్లు ఇప్పటికే నరికివేయబడ్డాయని తెలిపారు.