హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీ ఆకస్మిక తనిఖీ

KKD: కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సిబ్బంది హాజరు, ప్రజల నుంచి వచ్చిన అర్జీలు, రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ఆరా తీశారు. ప్రజలకు సేవలు సకాలంలో అందించాలని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యాన్ని సహించేది లేదని అధికారులను హెచ్చరించారు