గుంటూరు జిల్లా ఫిరంగిపురం పేరుకు వెనుక ఆసక్తికర చరిత్ర ఉంది. కొండ వీడు రాజుల కాలంలో ఇక్కడ ఫిరంగులు తయారు చేసే వారని, అందుకే ఈ పేరు వచ్చిందని స్థానికుల కథనం. ఫ్రెంచ్ తదితర ఐరోపా దేశస్థులను ‘ఫిరంగి’గా పిలిచే వారని, వారి కారణంగానే పేరొచ్చిందనే మరో వాదన ఉంది. 1891లో నిర్మించిన బాలయేసు కేథడ్రల్, సుమారు 900 ఏళ్ల నాటి చోళేశ్వర శివాలయం చరిత్రకు సాక్ష్యాలు.
ఆంధ్రప్రదేశ్
ఫిరంగిపురం పేరుకు ఆసక్తికర చరిత్ర!


