ASR: చింతపల్లి రాజమ్మగరువు ప్రాంతంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా నెలకొంది.పలు రోజులుగా చెత్త పేరుకుపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. చెత్తను పశువులు, కుక్కలు చెల్లాచెదురు చేయడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.దుర్వాసనతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజమ్మగరువులో పారిశుద్ధ్య సమస్య


