హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్

E.G: సెప్టెంబరు 12న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించి, బాధితులకు తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. రాజమండ్రి జిల్లా కోర్టులో బీమా సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులు, అధికారులతో సమావేశమై పెండింగ్ సివిల్, రాజీకి అర్హమైన క్రిమినల్ కేసుల జాబితాలను సిద్ధం చేయాలని సూచించారు.