హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోట ఎంపీడీవో కీలక సూచన

TPT: కోట పట్టణంలో రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్న ఆవుల యజమానులకు ఎంపీడీవో దిలీప్ కుమార్ నాయక్ హెచ్చరిక జారీ చేశారు. రెండు రోజుల్లో పశువులను ఇళ్లకు తరలించాలని సూచించారు. ఈనెల 21 నుంచి రోడ్లపై తిరిగే ఆవులను ముందస్తు సమాచారం లేకుండా గోశాలలకు తరలిస్తామని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ సమస్యల నివారణ కోసమే ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.