హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ వ్యయం తగ్గించేలా సౌర విద్యుత్ ప్రాజెక్టు: కలెక్టర్

కోనసీమ: మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు సౌర విద్యుత్ ప్రాజెక్టు అమలుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో మున్సిపల్ అధికారులతో తాగునీటి పంపింగ్ వ్యవస్థలు, వీధి దీపాలు, మున్సిపల్ కార్యాలయాలు తదితర సేవలకు సంబంధించిన సేవలపై సమీక్ష జరిపారు.