NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో బుధవారం భక్తులు ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూలమాలలు వేసి అలంకరించారు. అమ్మవారికి అభిషేకాలు కుంకుమార్చన ఇంకా అనేక పూజలను చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
చౌడేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు


