హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కోవెలకుంట్లలో ఉద్యోగమేళా

NDL: కోవెలకుంట్ల సనా డిగ్రీ కళాశాలలో బుధవారం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. 11 సంస్థల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహిస్తారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ, పీజీ అర్హత కలిగిన వారు హాజరుకావచ్చన్నారు.