అన్నమయ్య: వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామి ఆలయంలో నేడు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం పూజలు, స్నపన తిరుమంజనం, అనంతరం పట్టాభిషేకం జరుగుతుంది. సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రి 7.30 గంటలకు గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం


