హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

BPT: తిమ్మసముద్రం నుంచి కడవకుదురు సైఫన్‌కు వెళ్లే రహదారిలో ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో కే. విజయ్ ప్రకాష్ మోకాలికి బలంగా దెబ్బతగిలి తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న ఈఎంటీ ఆమోసు, పైలట్ కంచర్ల దేవరాజ్ తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు.