హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్‌ను కలిసిన వైసీపీ జడ్పీటీసీ రాంబాబు

AKP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బుచ్చయ్యపేట జడ్పీటీసీ, ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు దొండా రాంబాబు మంగళవారం తాడేపల్లిలో కలిశారు. చోడవరం నియోజకవర్గంలో వైసీపీ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. గోవాడ షుగర్స్ రైతుల బకాయిల సమస్యను జగన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు రాంబాబు తెలిపారు.