హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మిస్టరీగా మారిన సుప్రియ ఆచూకీ

కోనసీమ: ఆలమూరు మండలం చొప్పెల్ల లాకుల నుంచి జొన్నాడ వరకు కోరంగి మెయిన్ కాలువలో బ్యాంక్ ఉద్యోగి సుప్రియ (28) కోసం రెండో రోజు గాలింపు కొనసాగుతోంది. ఎస్సై జి. నరేష్ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లు కాలువను జల్లెడ పట్టినా ఆమె ఆచూకీ లభించలేదు. కాలువలో దూకి ఉంటే ఇప్పటికే మృతదేహం తేలేదని గజ ఈతగాళ్లు చెబుతున్నారు. దీంతో సుప్రియ అదృశ్యం మిస్టరీగా మారింది.