హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైకుంఠపురం హుండీ ఆదాయం రూ.86.14 లక్షలు

GNTR: తెనాలి వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో హుండీ లెక్కింపు మంగళవారం జరిగింది. నాలుగు నెలల 25 రోజుల కాలానికి రూ.86,14,317 నగదు, 20.9 గ్రాముల బంగారం, 206.4 గ్రాముల వెండి లభించాయి. అన్నదాన హుండీ ద్వారా రూ.72,741 ఆదాయం సమకూరింది. ఆలయ అధికారులు, బ్యాంకు సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ పాల్గొన్నారు.