హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాడపల్లి అన్నదానం ట్రస్ట్‌కు విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి బుధవారం తాడేపల్లిగూడెం వాస్తవ్యులు కందుల వీర వెంకటేశ్వరరావు, ఆదిలక్ష్మి దంపతులు వారి కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి చిత్రపటం అందజేశారు.