KNR: జిల్లాలో బుధవారం ఉదయం 7 గంటల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వర్షాల సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని హోర్డింగుల సమీపంలో ఉండొద్దని సూచించింది.
తెలంగాణ
మరి కాసేపట్లో భారీ వర్షం


