హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై గుంతలు.. ఇబ్బందుల్లో వాహనదారులు

WNP: వీపనగండ్ల నుంచి అమ్మపల్లికి వెళ్లే రహదారి వర్షం కురిసిన ప్రతిసారీ నీటితో నిండిపోతోంది. రోడ్డుపై గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నీరు నిలిచిపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. వర్షాకాలంలో సమస్య మరింత తీవ్రం కాకముందే అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.