హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చుక్కల దుప్పి వేటగాళ్ల అరెస్ట్

MHBD: గూడూరు మండలం దామరవంచ ఫారెస్ట్ బీట్ పరిధిలో చుక్కల దుప్పిని వేటాడిన ఇద్దరిని అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. వన్యప్రాణులను వేటాడేందుకు ఏర్పాటు చేసిన తీగ ఉచ్చుతో పాటు వేటాడిన దుప్పి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మనోజ్‌కుమార్, సందీప్‌ను అదుపులోకి తీసుకోగా, నవీన్ పరారీలో ఉన్నట్లు ఎస్ఆర్‌వో ప్రసాద్‌రావు మంగళవారం తెలిపారు.