హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గండికోట జలాశయం నుంచి నీరు విడుదల

KDP: గండికోట జలాశయం నుంచి 2,190 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. ఎత్తిపోతల పథకం ద్వారా చిత్రావతి రిజర్వాయర్‌కు 1,500, పైడిపాలెం రిజర్వాయర్‌కు 440, GNSS కాలువ ద్వారా కమలాపురానికి 250 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం గండికోటలో 14 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు.