హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాబోయే 5 రోజులు తేలికపాటి వర్షాలు

అనకాపల్లి జిల్లాలో రానున్న ఐదు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. వాతావరణ సలహా మండలి భేటీలో ఏడీఆర్ డా. సీహెచ్ ముకుందరావు ఈ వివరాలు వెల్లడించారు. ఈ సమయంలో పగటి ఉష్ణోగ్రతలు 34.9 నుంచి 35.6 డిగ్రీలు, రాత్రి వేళ 26.3 నుంచి 26.5 డిగ్రీల వరకు నమోదయ్యే సూచనలున్నాయని తెలిపారు.