ATP: బుక్కరాయసముద్రం మండలం బి.కొత్తపల్లిలోని సర్వే నంబర్ 185/4లో 1977లో కేటాయించిన 5.05 ఎకరాల డీ-పట్టా భూమిలో 1.05 ఎకరాలు మాయమైందని బాధితులు హసేన్, అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంవో నుంచి ఉత్తర్వులు వచ్చినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై కాంగ్రెస్ నేత ఇమామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంవో లేఖపై అధికారుల నిర్లక్ష్యం


