హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెనుకొండ కోటలో చారిత్రక చావడి పునరుద్ధరణ

సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని చారిత్రక కోటలో ఉన్న పురాతన చావడి ప్రాంత అభివృద్ధి పనులకు మంత్రి సవిత ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. గత మూడు దశాబ్దాలుగా సరైన సంరక్షణ లేక శిథిలావస్థకు చేరిన ఈ ప్రాంతాన్ని సుందరీకరించి పచ్చదనంతో కూడిన పార్కుగా తీర్చిదిద్దనున్నారు. పురాతన శిలా స్తంభాల రూపురేఖలు దెబ్బతినకుండా జాగ్రత్తగా పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు.