కృష్ణా: తోట్లవల్లూరు మండలంలోని పెనమకూరు, తోట్లవల్లూరు గ్రామ సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహిస్తున్నామని డిప్యూటీ MPDO శాంసన్ బాబు పేర్కొన్నారు. కొత్త ఆధార్ కార్డు నమోదు, 5 ఏళ్లు దాటిన పిల్లలకు బయోమెట్రిక్ నవీకరణ, పదేళ్లు పూర్తయిన వారికి ధ్రువీకరణ పత్రాల నవీకరణ చేపడతామన్నారు. ఈ శిబిరాలు ఈనెల 20 వ తేదీ వరకు ఉంటాయని, మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక ఆధార్ శిబిరాల ఏర్పాటు: MPDO


