హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెత్త కుప్పలతో మదీనా నగర్ వాసుల ఇబ్బందులు

HYD: యాకుత్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం మదీనా నగర్‌లోని హెచ్‌.నెం. 17/3/194/68/A వద్ద చెత్త పేరుకుపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుర్వాసనతో పాటు పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.