హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రీడా ప్రతిభకు ఐదు పాఠశాలల ఎంపిక

KRNL: జిల్లాలో క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదు పాఠశాలలను ‘స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్-2026’కు ఎంపిక చేయనున్నట్లు డీఈఓ సుధాకర్ మంగళవారం తెలిపారు. 2025-26 ఎస్‌జీఎఫ్ పోటీల ఫలితాల ఆధారంగా పాయింట్లు కేటాయించి ఎంపిక చేస్తామన్నారు. అర్హత పాఠశాలలు ధ్రువపత్రాలతో ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.