హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతి

JN: బచ్చన్నపేట గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీవో లావణ్య, ఎంపీవో రఘురామకృష్ణకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రతతో పాటు రక్షణ పరికరాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.