హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ

AKP: మునగపాకలో తాళం వేసిన ఇంట్లో మంగళవారం భారీ చోరీ జరిగింది. దంపతులు ఫార్మా కంపెనీకి, పిల్లలు కళాశాలకు వెళ్లిన సమయంలో దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలోని 10 తులాల బంగారం, 40 తులాల వెండితో పాటు రూ.50 వేల నగదును అపహరించారు. బాధితులు ఇంటికి చేరుకునేసరికి చోరీ ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.