హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ రహదారిపై గాజు పెంకులు

SRPT: తుంగతుర్తి-ఆర్వపల్లి మార్గంలో జాతీయ రహదారిపై గాజు పెంకులు వాహనదారులను భయాందోళనకు గురిచేసాయి. ఖాళీ గాజు సీసాల భారీలోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ నుంచి మల్లన్నగుట్ట సమీపంలో కొన్ని బస్తాలు జారిపడటంతో సీసాలు పూర్తిగా పగిలిపోయి రహదారంతా నిండిపోయింది. ఆ సమయంలో వెనుక నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెనుప్రమాదం తప్పిందన్నారు. వాహనదారుడే వాటిని తొలగించడంతో ఊపిరి పీల్చుకున్నారు.