SKLM: వైసీపీ నేత చింతాడ రవి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా తప్పుడు కేసులు నమోదు చేస్తోందని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆరోపించారు. ఆమదాలవలసలోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అక్రమ కేసులకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ భయపడేది లేదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ కేసులకు భయపడేది లేదు: మాజీ ఎమ్మెల్యే


