హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇళ్లకు చేరిన తప్పిపోయిన విద్యార్థినులు

NLR: కొడవలూరు ఎస్టీ బాలికల వసతి గృహంలో ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు కనిపించకపోవడంతో 112కు సమాచారం అందింది. అప్రమత్తమైన రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు కొడవలూరు, కోవూరు పోలీసులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు మూడు గంటల గాలింపు అనంతరం మంగళవారం రాత్రి 11 గంటలకు విద్యార్థినులు తమ ఇళ్లకు వెళ్లినట్లు సమాచారం అందడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.