హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్సుల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి: ఎస్పీ

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, మంగళవారం విద్యా సంస్థల బస్సుల భద్రతపై డీటీవో, ఎంవీఐలు, యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి బస్సులో డ్యాష్ బోర్డ్ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. డ్రైవర్ల నేరచరిత్ర పరిశీలించి, యూనిఫాం, గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండేలా చూడాలని సూచించారు.