హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మెట్రో రైల్ రెండోదశకు ఎన్‌ఓసీలు జారీ చేయాలి'

HYD: మెట్రో రైల్ రెండోదశ ప్రాజెక్టుకు సకాలంలో అనుమతులు పొందే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ప్రతిపాదిత ప్రాజెక్టులు కలిగిన మంత్రిత్వ శాఖలు, విభాగాలతో సచివాలయంలో సోమవారం సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి HAML ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ హాజరయ్యారు. ప్రతిపాదిత రెండోదశ కారిడార్ల కోసం వీలైనంత త్వరగా ఎన్‌ఓసీలు జారీ చేయాలని సంబంధిత శాఖలను అభ్యర్థించారు.