హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

KDP: సిద్ధవటం మండలం మాధవరం-1పరిధిలోని కడప–చెన్నై జాతీయ రహదారి బంగారుపేట వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మాధవరం-1వెంకటేశ్వరపురం గ్రామానికి చెందిన మాడా బాలాజీరావు (45) రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.